నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సర్పంచ్ సరీన్ ఉపాధ్యాయులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరీన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులతో సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాలతో నిర్మించిన క్యాలెండర్ ఎంతో బాగుందని, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలతో పాటు ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ శ్యామల, ఎస్ఎంసి చైర్మన్ సునీత, విడీసీ చైర్మన్ సురేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.