Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారి వేణు మాట్లాడుతూ.. సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర వందల సంవత్సరాల నుండి కొనసాగుతుందని, ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయ ఆవరణంలో మహారాష్ట్రలోని అంబులుగా మహారాజ్ ఆధ్వర్యంలో సప్త కొనసాగించడం ఆనవాయితీ గా వస్తుందని అన్నారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా శ్రీరామనవమి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సప్త కార్యక్రమం శుక్రవారం ముగిసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భజన కీర్తన మహారాజులకు భోజన వసతులు నివాస వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ముగింపు రోజున అందరికీ భోజనాలు వడ్డించే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ భోజన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తోటవార్ నాగనాథ్ ఆలయ అధికారి కల్పన సిబ్బంది అశోక్ పూజారులు భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -