బీఆర్ఎస్ పార్టీ డిమాండ్..
నవతెలంగాణ-మద్నూర్
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మద్నూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు కలిసి మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మండల నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హాయంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యధావిధిగా కొనసాగించాలని, ఈ పథకానికి తులం బంగారం జోడించి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు వెంటనే తులం బంగారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర కు ఆందోళన కార్యక్రమంలో బన్సీ పటేల్, కాశీనాథ్ పటేల్, కృష్ణ పటేల్, డోంగ్లి మండల నాయకులు రాజు పటేల్, పెద్ద ఎక్లార పండిత్ రావు పటేల్, అంతాపూర్ మారుతి ,ఈ ప్రముఖులతో పాటు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై రాష్ట్ర ఆందోళన చేపట్టారు.
కళ్యాణలక్ష్మి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



