- Advertisement -
మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలో 2 వార్డు లో మొక్కలు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికై కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు జె నాగేంద్ర, నర్మే నవీన్, చాలా ప్రసాద్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



