నవతెలంగాణ-ఆర్మూర్
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ టాప్ 100 పోలీస్ చీఫ్స్ జాబితాలో జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ పోతరాజు సాయి చైతన్యకు జాతీయ గుర్తింపు దక్కడంతో మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత, పోలీసు శాఖ అందిస్తున్న సేవలు తదితర అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కమిషనర్ వివరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు.
సీపీని కలిసిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



