నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ పరిధిలోగల కేజీబీవీ పాఠశాల/ కళాశాలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, పాఠశాలలో అందుతున్న భోజనం, వసతి, విద్యా సౌకర్యాలను, ఇతర మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతుల గురించి సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు తరగతి నిర్వహించి, విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆర్డీఓ రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సీఎంఓ రమేష్ , ఎమ్మార్వో రవికుమార్, కెజిబివి ప్రిన్స్ పాల్ భవాని తోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



