మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. జీవిత ఖైదు నిలిపివేత
ముంబయి : హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంఘ్ పరివార్ నేత సచిన్ అందురేకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఉపా ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును కూడా నిలిపివేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ రంజిత్‌సింహా భోంసాలేతో కూడిన ధరాస్మనం మంగళవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. కాగా, ఈ కేసులో సహ దోషి శరద్ కలాస్కర్‌కు బాంబే హైకోర్టుకే చెందిన జస్టిస్ అజయ్ గడ్కరీ నేతృత్వంలోని కో-ఆర్టినేట్ బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యకర్త గోవింద్ పన్సారే హత్య కేసులోనూ అందురే విచారణను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మం జూరైంది. అయితే అంధురేకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయని, దీని ఫలితంగా అప్పీల్‌లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం కూడా ఉందని హైకోర్టు తెలిపింది. మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న దభోల్కర్(67)ను 2013 ఆగస్టు 20న పూణేలో ఉదయం వాకింగ్ చేస్తుండగా సంఘ్ పరివార్ గూండాలు బైక్‌పై వచ్చి కాల్చి చంపిన సంగతి విదితమే. ప్రఖ్యాత హేతువాద పాత్రికేయులు గౌరి లంకేశ్వర్, గోవింద్ పన్సారే వంటి వారిని ఒకే తరహాలో సంఘ్ పరివార్ గూండాలు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే హత్యకు గురైన ధబోల్కర్ కేసులో దాదాపు 11 ఏండ్ల విచారణ తరువాత పూణేలోని ఉపా ప్రత్యే క కోర్టు అందురే, కలాస్కర్‌ను దోషులుగా నిర్ధారించింది. ఐపీసీలోని సెక్షన్ 302, సెక్షన్ 34 కింద 2024, మే 10న జీవితఖైదు విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టును అంధూరే, కలస్కర్ ఆశ్రయించగా అంధూరేకు బెయిల్ మంజూరుతో పాటు జీవితఖైదును కూడా నిలిపివేయడం గమనార్హం.
దభోల్కర్ హత్య కేసులో నిందితుడికి బెయిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



