Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపరిశోధన ఫలాలు రైతులకు చేరాలి

పరిశోధన ఫలాలు రైతులకు చేరాలి

- Advertisement -

రాష్ట్రంలో కూరగాయల కొరత : 
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 
నాగేశ్వర రావు
‌ఉద్యాన కళాశాలలో హార్టికల్చర్ పరిశోధన 
కాంప్లెక్స్‌‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

​ప్రయోగశాలలో జరిగిన పరిశోధన ఫలాలు రైతులకు చేరాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సాగుతోనే భవిష్యత్‌ అని, ఆ దిశగా రైతు నిలదొక్కుకునే పద్ధతులు రావాలన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న హార్టికల్చర్ రీసెర్చ్ కాంప్లెక్స్‌‌కు మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యాన రంగాలు లాభసాటిగా ఉండాలంటే ప్రతి ఆధునిక టెక్నాలజీ రైతుకు చేరాలన్నారు. చిన్న, సన్న కారు రైతులకు ఆధునాతన సాగు పద్ధతులు అందుబాటులో ఉండాలని చెప్పారు. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకునే రకాలను శాస్త్రవేత్తలు రూపొందించి రైతులకు అందించాలని సూచించారు. కరోనా సమయంలో అన్ని ఇతర బిజినెస్‌‌లు బంద్ అయినా కేవలం వ్యవసాయమే సాగిందని గుర్తు చేశారు. పామ్ ఆయిల్ సాగులో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి ఎదిగిందని, భవిష్యత్‌‌లో 10 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలం, జిల్లా కేంద్రాల్లో ఆధునిక సమాచారంతో కూడిన డెమోలు రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. హరితవిప్లవంతో భూములు విషతుల్యమయ్యాయని, రసాయన ఎరువులు, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటం వల్ల చాలా దేశాలు మన ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వనరులకు కొదవ లేదని, సరైన విధంగా వాడుకుంటే వ్యవసాయంలో లీడర్ గా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 70శాతం పైగా కూరగాయల కొరత ఉందని, బీహార్ నుంచి దిగుమతి చేసుకోవటం మంచి పరిణామం కాదని అన్నారు. వర్సిటీ ల్యాండ్ కాపాడుకుంటెనే భవిష్యత్‌ ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎల్‌‌నినో పరిస్థితులనే ఎదుర్కొనేందుకు ఏప్రిల్ నుండే కంటెన్జెన్సీ ప్రణాళిక సిద్ధంగా ఉంచామని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ చెప్పారు. కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలు, విత్తనాలపై సమగ్ర పరిశోధనలు చేపట్టేందుకు హార్టికల్చర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామని వర్సిటీ వైస్ చాన్సలర్ డా. డి.రాజి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ అథారిటీ డైరెక్టర్ డా. ఏ. కిరణ్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, డీన్ డా. చీనా, రీసెర్చ్ డైరెక్టర్ డా. లక్ష్మీనారాయణ, పీజీ డీన్ డా. సురేష్, బోర్డు సభ్యులు పంకజ్ రెడ్డి, శిఖా మణి, అనిల్ ఈపూర్, డా. పి.ప్రశాంత్, డా.అనిత కుమారి, డా.సునందిని, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -