బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దనీ, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారేసరికి అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కర్కశత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, గృహనిర్బంధంలో ఉంచడాన్ని ఖండించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలనీ, అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను విగ్రహ తొలగింపు వంటి తుగ్లక్ చేష్టలతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదని సూచించారు. ముమ్మాటికి రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేననీ, అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టుకోవటమే కాకుండా ఆయన వీరోచిత పోరాటానికి శాశ్వత కీర్తిని తెస్తామని తెలిపారు.
పెద్ది విగ్రహం తొలగింపు పాశవిక చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



