Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పునుంతల మండల కేంద్రంలో బుధవారం ఫోటోగ్రాఫర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగానికి ఆద్యుడు లూయిస్ డాగ్యూరేను స్మరించుకుంటూ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. ఫోటోగ్రఫీ ద్వారా చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిణామాలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల ఫోటోగ్రఫీ మండల అధ్యక్షుడు బి. శివకుమార్, కోశాధికారి శ్రీను, మల్లేష్, లక్ష్మణ్, రాజు, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -