నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని 1వ, 17వ వార్డుల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. వార్డుల్లో చెత్త సేకరణ, రోడ్లు, డ్రైనేజీల శుభ్రత, పారిశుధ్య నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. శానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గడ్డం మహేష్, లోలం శ్రీనివాస్, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వేణుప్రసాద్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, నాయకులు అమీర్, శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది, సంబంధిత వార్డుల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
శానిటేషన్ పనులపై చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



