- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ నవలా సామ్రాట్ మున్షి ప్రేమ్‌చంద్ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమ్‌చంద్ హిందీ సాహిత్యానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. హిందీ ఉపాధ్యాయులు గఫూర్ శిక్షక్ హిందీ భాష ప్రాధాన్యతను వివరించి, ప్రేమ్‌చంద్ రచనలు చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రేమ్‌చంద్ జీవిత విశేషాలపై ప్రసంగాలు చేయగా, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



