- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
క్రాంతి గ్రామ సంఘం పరిధిలోని చిన్న సంఘాల పనితీరును సమీక్షించేందుకు అంతర్గత ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న సంఘంకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించారు. ఆడిట్ సందర్భంగా సంఘ సభ్యులు ప్రతినెలా పొదుపు మొత్తాలను సక్రమంగా చెల్లిస్తున్నారా, రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. అలాగే 2024 సంవత్సరం నుంచి 2026 మార్చి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రాజయ్య, ఏపీఎం సాయిలు, సీసీ జయశ్రీ, వీఓఏలు పాల్గొన్నారు.
- Advertisement -



