Thursday, August 20, 2026
E-PAPER
Homeజిల్లాలుకొయ్యూరు పీఎస్‌ లో డీఐజీ ఆకస్మిక తనిఖీ

కొయ్యూరు పీఎస్‌ లో డీఐజీ ఆకస్మిక తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా ఐపీఎస్ గురువారం భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్, డీఐజీకి ఘన స్వాగతం పలికారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్‌ అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ తదితర అంశాలను డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, ముఖ్యంగా  CCTNS 2.0,, e-Sakshya, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశాల్లో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ  సూర్యనారాయణ, కాటారం సీఐ  నాగార్జునరావు, మహాదేవపూర్ సీఐ  వెంకటేశ్వర్లు ,పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -