నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కన్మకాల్వ గ్రామానికి చెందిన గుమ్మటి హరిప్రసాద్ ఈ నెల 2న తన ఊరు నుండి మోటార్ సైకిల్ పై నవాబుపేట కు వస్తుండగా మార్గమధ్యలో తన మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్నాడు. ఈ విషయమై వెంటనే నవాబుపేట పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు అందజేశారు. సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సైన ఫోన్ ను పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కామారం గ్రామానికి చెందిన అశోక్ ఈ నెల 4న తన మొబైల్ ఫోన్ ని ఇంట్లో ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళి తిరిగొచ్చేసరికి దొంగలు అపహరించారు. దీంతో అశోక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫోన్ ను కూడా పోలీస్ సిబ్బంది సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేస్తే.. తీగలపల్లి గ్రామంలో దొరికింది.
సెల్ ఫోన్ అపహరణకు గురైన హరిప్రసాద్, అశోక్ లను శుక్రవారం నవాబ్ పేట్ ఎస్సైనరేందర్ స్టేషన్ కు పిలిపించి, వారి మొబైల్ లను ఇద్దరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరెందర్ మాట్లాడుతూ.. ఎవరైనా తమ మొబైల్ ఫోన్ లను పోగొట్టుకున్న లేదా ఎవరైనా దొంగిలించబడినా వెంటనే స్తానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి, సిఈఐఆర్ పోర్టల్ లో తమ ఫోన్ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం సెల్ ఫోన్ బాధితులు హరిప్రసాద్, అశోక్ లు సంయుక్తంగా నవాబ్ పేట్ ఎస్సై నరేందర్ కు, ఇతర పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు.



