Friday, August 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి..

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి..

- Advertisement -

కుభీర్ లో బీఆర్ఎస్ నాయకులు నిరసన, ధర్నా
నవతెలంగాణ-కుభీర్
ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ -కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కిరణ్ కొమ్రే వార్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అన్న బావ్ సాటే, అంబేద్కర్, గాంధీ, ఛత్రపతి శివాజీ, విటలేశ్వర్ నుంచి పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో భారీగా తహశీల్దార్ కార్యాలయనికి ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కిరణ్ కొమ్రే వార్ మాట్లాడుతూ.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఆడబిడ్డలకు అందజేస్తామని మాయ మాటలు చెప్పి పేదింటి ఆడపిల్లలను మోసం చేశారని మండి పడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ జిల్లా నాయకుడు లోలం శ్యామసుందర్ సహకార సంఘం చైర్మన్ రేకుల చరణ్, మాజీ వైస్ చైర్మన్ మోహినొద్దీన్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిల అనిల్, నాయకులు మండజీ లింబాద్రి, ఎకినోద్దిన్, దొంతుల దేవిదాస్‌, రమేష్‌, పోశెట్టి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -