Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం

కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో యువజన కాంగ్రెస్‌ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ సూచించారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో యువజన కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, ఐ వై సి  యాప్‌లో గ్రామ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమీక్షించారు. ఐ వై సి యాప్ ద్వారా గ్రామ కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులు సూచించారు. పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. యువతకు గుర్తింపు, అవకాశాలు కల్పించడం ద్వారా యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయాలని, యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. ఐ వై సి యాప్‌లో గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తి చేసి, సంస్థాగత బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్దార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్‌తో పాటు మండల, పట్టణ, గ్రామస్థాయి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -