Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీఎస్‌యూటీఎఫ్‌ నేత రమణయ్య శాస్త్రి కన్నుమూత

టీఎస్‌యూటీఎఫ్‌ నేత రమణయ్య శాస్త్రి కన్నుమూత

- Advertisement -

పలువురి నివాళులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

యూటీఎఫ్ మాజీ సహ అధ్యక్షులు రమణయ్య శాస్త్రి (72) ఆదివారం ఉదయం హైదరాబాద్‌‌లోని సైనిక్‌ ‌పురిలో మరణించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, విశాలి, కొండలరావు, సీనియర్ నాయకులు నరహరి, సంయుక్త, రాజన్ బాబ్, ఇంద్రజిత్, వరప్రసాద్, దేవదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, ఉపాధ్యక్షులు నాగరాజు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. రమణయ్య శాస్త్రి ఉపాధ్యాయ సంఘానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన అంత్యక్రియలను నిర్వ హించారు. అంతకుముందు నాయకులు మాట్లా డుతూ “రమణయ్య శాస్త్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూటీఎఫ్‌ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో యూటీఎఫ్ విస్తరణకు ఆయన ఎంతగానో కృషి చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, సహ అధ్యక్షులుగా, కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేశారు. ముఖ్యంగా ఎయిడెడ్ మేనేజ్ మెంట్ల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సంఘం అభివృద్ధికి పాటుపడ్డారు. వృత్తి పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, కడదాకా విలువలకు కట్టుబడి ఉన్నారు. నేటి ఉపాధ్యాయులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాకుండా టీఎస్ యూటీఎఫ్ కు తీరని లోటు….” అని కొనియాడుతూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. పలువురు నాయకులు రమణయ్య శాస్త్రికి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -