Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ హాజరవుతారనీ, ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓ జయరాం నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు రెవెన్యూకు సంబంధించి మూడు ఫిర్యాదులు అందాయని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. పదిహేను రోజుల లోపు ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ సురేష్, ఎంఈఓ నాగ్య నాయక్, ఎంపీఓ బద్రు నాయక్, మెడికల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఏపీఓ జ్యోతి, ఎంపీలు సంతోష్, మహేష్ ,ఖాజా పశుసంవర్ధక శాఖ ఎక్సైజ్ శాఖ శిశు సంక్షేమ శాఖలో సంబంధించిన అధికారులు సూపరింటెండెంట్ గోవింద రెడ్డి, ఈసీ నర్సింహ, చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -