Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ ఆలయానికి సోమూర్‌ భక్తుల పాదయాత్ర

సలాబత్పూర్ ఆలయానికి సోమూర్‌ భక్తుల పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా మండల పరిధిలోని సోమూరు భక్తులు పెద్ద సంఖ్యలో సలాబత్పూర్‌ ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్ళారు. అదేవిధంగా పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్ష‍లు ధరాస్‌ సాయిలు, ఆలయ టెంపుల్ మాజీ చైర్మన్ రామ్ పటేల్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, మద్నూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి, పెద్ద తడగూర్ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న, భక్తులకు స్వాగతం పలికారు. సోమూరు నుంచి సలాబత్పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయం వరకు 15 కిలోమీటర్లు భక్తుల పాదయాత్ర కొనసాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -