సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని, నున్నా
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేక రైతు ఉద్యమాలు నిర్వహించి, రైతాంగ సమస్యలపై, నీటిపారుదల సమస్యలపై, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రపంచ వాణిజ్య ఒప్పందాలపై ఎన్నో విశ్లేషణలు చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అని, ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, మల్లారెడ్డి ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవనంలో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ జరిగింది. చివరి శ్వాస వరకు గొప్ప మార్క్సిస్టుగా, ఉన్నత విలువలతో జీవనం కొనసాగించిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అని, వారి మరణం రైతాంగ ఉద్యమాలకు, ప్రజా సంఘాల ఉద్యమాలకు తీరని లోటని అన్నారు
మల్లారెడ్డి ఆశయ సాధనకు ఉద్యమిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



