Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముమ్మరంగా కొనసాగుతున్న వనమహోత్సవాలు

ముమ్మరంగా కొనసాగుతున్న వనమహోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలోని గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఆయా గ్రామాల సర్పంచులు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో నిర్వహించిన టేకు ఏర్ల మొక్కల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని టేకు ఏర్ల మొక్కలు పంపిణీ చేసి, నాటారు. అదేవిధంగా మేనూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్ పటేల్, డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అంజని బాయి వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించి, మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆయా గ్రామాల పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -