Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమల్లారెడ్డి మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు

మల్లారెడ్డి మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు

- Advertisement -

– నిరాడంబర కమ్యూనిస్టు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి 
నవతెలంగాణ-కంఠేశ్వర్ : సిపిఐ(ఎం) సీనియర్ నేత,రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతు ఉద్యమాలకు తీరని లోటని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ గురువారం నాందేవ్వాడ రైతు సంఘం కార్యాలయంలో మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.  ఈ సమావేశానికి దేవెందర్సింగ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ….. హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మూడు గంటలకు సారంపల్లి మల్లారెడ్డి తుది శ్వాస విడిచారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  వరంగల్ లో 1939లో పుట్టి గ్రామ సర్పంచ్ గా పని చేసాడు వరంగల్ జిల్లా కార్యదర్శి గా పని చేసి భూపోరాటాలు నడిపి పేదలకు అండ్డగా నిలబడ్డాడు రాష్ట్ర వ్యాప్త రైతు ఉద్యమాలలో సారంపల్లి మల్లారెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. సీడ్ పత్తి రైతుల పోరాటంలో, నెట్టెంపాడు నిర్వాసితుల పోరాటంలో, ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ముంపుకు గురైన ర్యాలంపాడు గ్రామ ప్రజలకు పరిహారం కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. సీడ్ పత్తి సాగులో నష్టపోతున్న రైతులకు అండగా వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి పంట పొలాలు సందర్శించి రైతులకు మద్దతుగా రాష్ట్రస్థాయిలో అధికారులతో, మంత్రులతో అనేక పర్యాయాలు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడ్డారని తెలిపారు.  వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి  ఆ జిల్లా లో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు.  కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప,ఈ ఒడ్డెనా,భూమన్న, ఎల్లప్పా, ఎర్ర సాయిలు, రాజేశ్వర్, నాగలక్ష్మి, ముతేన్న,దేవునిరి రాజన్న, లింగం, తుంగిని సర్పంచ్ భూమన్న, బైరి కిరణ్,వెంకటి నాయక్, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -