నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు అక్కా చెల్లెలు, అన్నా-తమ్ముళ్లకు పిల్లా పాపలతో కలిసి, రాఖీలు కట్టి, రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిఠాయిలు తినిపించారు. సోదర సమానులకు సైతం మహిళలు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం 7 గంటల నుండి వివిధ ప్రాంతాల నుండి ఆలేరు పట్టణానికి వచ్చి, హైదరాబాద్ తన సుదూర ప్రాంతాలకు వెళ్లి, అన్న తమ్ములకు, అక్కా చెల్లెలు రాఖీలు కట్టారు. పట్టణంలో ఐదు రూపాయలు మొదలుకొని 10, 15 ,20 , 25 ,30, 35, 45 ,50 నుండి 100, 200 ,300 ,400 వెండితో కూడినవి 500 నుండి 1000 రూపాయల వరకు అమ్ముడుపోయాయి. వివిధ ఆకృతులతో కూడినవి, బాక్స్ ఐటమ్స్ ,జరీ , దూది రాఖీ, ఫ్యాన్సీ, టోన్స్, పూసలు పూసల రాఖీలు, నెమలి ఈకల చిత్రాల రాఖీలు, నీలిరంగు రాఖీలు, గ్రీన్,పసుపు, ఎరుపు తో పాటు వివిధ రంగులలో వివిధ ఆకృతులతో కూడిన రాఖీలను విక్రయాలకు పెట్టారు. ఆన్లైన్లో రాఖీ ల విక్రయాలు జరగడంతో కొనేవాళ్లు లేక రాకి షాపులో అంతంత మాత్రమే విక్రయాలు జరిగాయని, ఆన్లైన్ లో రాఖీల కొనుగోలు కారణంగా, రిటైల్ విక్రయదారులకు ఈ సంవత్సరం వ్యాపారం సరిగా లేదని రిటైల్ విక్రయదారులు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విపు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గ ప్రజలకు అక్కాచెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మెరుగైన జీవితం సిద్ధించాలని కోరారు.
పట్టణంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



