– తాంజీమ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం
నవతెలంగాణ-సత్తుపల్లి
మతోన్మాద శక్తులను తరిమికొట్టేందుకు మైనార్టీలంతా ఏకమై పోరాడాలని తాంజీమ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం పిలుపునిచ్చారు. శుక్రవారం సత్తుపల్లిలోని పెద్ద మసీదు వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విడదీస్తూ, నిరుద్యోగం, అధిక ధరలతో ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించిందని విమర్శించారు. యువతను మత్తుమందులు, విదేశీ ఛానెళ్ల ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు మైనార్టీలను కరివేపాకులా వాడుకుంటూ, వారి ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చే నాయకులు గెలిచాక మైనార్టీ భూములు, శ్మశాన వాటికలను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, బీహార్‌లో ఆదిత్యపై క్రూరంగా ప్రవర్తించారని నిరసించారు. ఈ కార్యక్రమంలో తాంజీమ్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. సైదా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, రామ విజయ్ కుమార్, సదర్ ఎస్.కె. రసూల్, షేక్ సైఫుద్దీన్, బిగ్ షాట్ అజార్, ప్రెసిడెంట్ లాల్ సుభాని, వలి, షేక్ ఇస్మాయిల్, మొహిద్దీన్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాద శక్తులను తరిమికొట్టేందుకు మైనార్టీలంతా ఏకం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



