Friday, August 28, 2026
E-PAPER
Homeఖమ్మంకేంద్ర ప్రభుత్వ రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను సహించం

కేంద్ర ప్రభుత్వ రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను సహించం

- Advertisement -

– ఎమ్మెల్యే మట్టా రాగమయికి ‘అఖిల భారత ఐక్య రైతు సంఘం’ వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి 

కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతాంగ, శ్రామిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) నాయకులు తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే ఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా, రైతు సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన డిమాండ్ల చార్టర్‌తో కూడిన వినతిపత్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్‌కు సంఘం ప్రతినిధులు అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు బీరెల్లి లాజర్, గంటా శ్రీను, అమర్లపూడి శరత్ మాట్లాడుతూ… 385 రోజుల రైతు పోరాటం ద్వారా 3 నల్ల చట్టాలను రద్దు చేయించినా, 2021 డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను నేటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. C2+50% చట్టబద్ధమైన ఎంఎస్పీ (ఎంఎస్పీ), సంపూర్ణ రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలిపివేత, కేసుల ఉపసంహరణ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పేద రైతుల రుణమాఫీని నిరాకరిస్తూ, రూ. 16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను రద్దు చేయడాన్ని తప్పుపట్టారు. విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల స్థానిక వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ డివిజన్ అధ్యక్షుడు ఒగ్గు నాగిరెడ్డితో పాటు నాయకులు కోర్స వెంకటేష్, తాటి రాజు, సున్నం కృష్ణ, ఆదాం, నాగప్రసాద్, బొజ్జ విశ్వనాధం, సున్నం రాజారావు, నేకొండ అలివేలు, నారాయణ, భద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -