Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అవినీతి బయటపెడతాం 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అవినీతి బయటపెడతాం 

- Advertisement -

జూన్ 23న సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ పర్యటన
ఉమ్మడి మిడ్జిల్, ఉర్కొండ అభివృద్ధికి భారీ నిధులు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ – మిడ్జల్

మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి  మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామానికి, తండాలకు బీటి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, త్రిబుల్ ఐటీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  జూన్ 23న మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు మిడ్జిల్ మండలం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని అన్నారు. ఉమ్మడి మిడ్జిల్, ఉర్కొండ మండలాల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులను సీఎం మంజూరు చేస్తారని స్పష్టం చేశారు.

అలాగే, మిడ్జిల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో సుమారు 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని, ఉర్కొండలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. ఈ అంశంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి , ఎమ్మార్వో స్వప్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -