Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి 

రేపు నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారని మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని సూచించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న షూ పంపిణీ కార్యక్రమానికి మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పర్యటన గ్రామాలు దయ పంతులపల్లి, హాజీపూర్, కొండాపూర్ రుద్రారం, కాకర్ల పాడ్, తీగలపల్లి, సిద్ధోటం, కారుకొండ, హన్మసానిపల్లి, కూచూర్- కారూర్ ఇప్పటూరు, చెన్నారెడ్డిపల్లి యన్మన్ గండ్ల లో పర్యటించనున్నారు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -