Monday, April 13, 2026
E-PAPER
Homeదర్వాజయుద్ధం అనివార్యమైనప్పుడు

యుద్ధం అనివార్యమైనప్పుడు

- Advertisement -

అగ్రరాజ్య దురహంకారం
అకస్మాత్తుగా అగ్నిని కురిపించినప్పుడు
దగ్ధమైన పిల్లల దేహాల సాక్షిగా
ధిక్కారం అనివార్యమైంది
యూదు దురహంకారాన్ని
మెదడు నిండా నింపుకున్న ఉన్మాదొకడు
మత రాజ్య అంతమే ధ్యేయమని
విచ్చుకత్తులతో విరుచుకుపడ్డప్పుడు
ప్రతిఘటన తప్పనిసరయింది
ఈ ప్రపంచంలో
ఎవరి రాజ్యం వాళ్లది కదా!
ఎవరి దేశం వాళ్ళది కదా!
ఎవరి పాలన వాళ్ళది కదా!
పాలనను నిర్ణయించుకోవాల్సింది
ఆ దేశపు ప్రజలు కదా!
పరాయి ప్రజల పుట్టలో
పాముల జొచ్చి సౌదాలు నిర్మించిన వాడు
దేశాల పొట్టల్లో దూరి
సంపదలు కొల్లగొట్టి బలిసిన వాడు
బలవంతపు ఉద్బోధలకు బరి గీసినప్పుడు
తెగించక చేసేదేముంది?
వాడు బందూకుతో కొడితే
బరిసెతో పోటైనా వెయ్యాలి కదా!
వాడు బాంబులు విసిరితే
గులకరాయైనా ఎదురు ఎగరాలి కదా!
వాళ్లు బలవంతులే కావచ్చు
ఓటమి తప్పక పోవచ్చు
అయినా పోరి ఓడాలి కదా!
దుర్మార్గాన్ని దునుమాడి తీరాలి కదా!
ప్రతిఘటన రుచి ఎలా ఉంటుందో చూపాలి కదా!
(ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ నేపథ్యంలో)

  • వి. ఆర్‌. తూములూరి, 9705207945
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -