రాజ్యసభ సభ్యుడు వెం నరేందర్ రెడ్డి
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాసం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల మహిళ నాయకురాలు హెచ్ అలివేలు మృతి చెందడం ఎంతో బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ అన్నారు. ఆదివారం రామన్నగూడెం గ్రామంలోని కాసం లక్ష్మారెడ్డి స్వగృహంలో తన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాసం లక్ష్మారెడ్డి అంచలంచలుగా ఎదుగుకుంటూ వచ్చి పేదల అభివృద్ధి కోసం ముందడుగు వేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. అంతేకాకుండా పార్టీ అభివృద్ధి కాకుండా ఏ ఎన్నికల వచ్చినా పార్టీ గుర్తు మీద నిలబడ్డా వ్యక్తి గెలుపు కోసం తాను ఎంతగానో కృషి చేశారని చెప్పారు.
ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మృతి పార్టీకి, జిల్లాకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. హెచ్ అలివేలు అకస్మాత్తుగా మరణం చెందడం ఎంతో బాధాకరమని, ఆమె మృతి మండలానికి పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆమెకు ప్రాణమని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని ప్రతి ఒక్కరికి సహకారం అందించిన వ్యక్తి నేడు మరణించడం ఎంతో బాధాకరమని తెలిపారు, మీ కుటుంబాలకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి ,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఆకుతోట సతీష్, రావుల సతీష్ ,మద్ది రాజేష్, క్రాంతి రెడ్డి ,శ్రీపాల్ రెడ్డి ,మౌనేందర్, పెరుమాండ్ల రాజు గౌడ్, చీకటి సంధ్యా వీరన్న, గుదే యుగేందర్, వివిధ గ్రామాల సర్పంచులు ఆ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



