Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సి కాలని విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

ఎస్సి కాలని విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం మండల ఎంపిడిఓ క్రాంతి కుమార్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఏపీఎం హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూనిపామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సమానత్వ భావన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో యూనిఫాం ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య బోధనకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కళ్యాణ్, సిసి వెంకటయ్య, ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, సురేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సరిత, సిఆర్పి సమత, ఇందిరా మహిళా శక్తి సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -