Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నియామకం

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నియామకం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు,రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచన మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను వేసినట్లుగా తెలిపారు. పెద్దతూండ్ల గ్రామ శాఖ అధ్యక్షుడుగా తాళ్ల రవిందర్, అడ్వాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడుగా అజ్మీరా రాజు నాయక్, దుబ్బపేట గ్రామశాఖ అధ్యక్షుడుగా అజ్మీరా సతీష్ నాయక్ లను ఏకగ్రీవంగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందేలా చూడాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బడితెల రాజయ్య, సర్పంచ్ల  పొరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప ముండయ్య, మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహాల్ రావు, సర్పంచ్ బండారి నర్సింగం, యూత్ కాంగ్రెస్ నాయకుడు మండల రాహుల్, కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్, కిషన్ నాయక్, అడ్వాల శ్రీనివాస్, రాజమొగిలి, కేశవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -