Tuesday, April 14, 2026
E-PAPER
Homeజిల్లాలురాజ్యాంగ దార్శ‌నికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్

రాజ్యాంగ దార్శ‌నికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్

- Advertisement -
  • జయంతి వేడుకల్లో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి
    నవతెలంగాణ-మద్నూర్
    జ్ఞానమే శక్తిగా మార్చి భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన గొప్ప నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సంద‌ర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో సత్కరించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన జయంతి వేడుకల ఉత్సవ సభలో సర్పంచ్ పాల్గొన్నారు. మహిళలు సర్పంచ్‌కు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం రూపులు దిద్దడానికి జ్ఞానమే శక్తిగా మార్చి రచించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ జయంతి వేడుకల ఉత్సవ సభలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ పటేల్ మాజీ సింగిల్ విండో చైర్మన్లు శ్రీనివాస్ పటేల్, కొండ గంగాధర్ మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి, మాజీ ఎంపిటిసిలు, మహిళలు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -