Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

- Advertisement -

డీజీపీ సీవీ ఆనంద్‌
ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా చెక్కులు అందజేత
​నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

విధి నిర్వహణలో, వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల ను అందజేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని డీజీపీ కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను అందించారు.
​ రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి
శంకర్‌పల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ముత్తంగి శ్రీనివాస్‌ వెలిమడ తండా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తండ్రి ముత్తంగి యాదయ్యకు డీజీపీ రూ. కోటి బీమా చెక్కును అందజేశారు.
​ఇతర సిబ్బంది…
నల్లగొండ జిల్లా కనగల్‌ లో పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్‌ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు 2025 జూన్‌ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్ కు చెందిన మరో పోలీసు కానిస్టేబుల్ కె.వెంకటరెడ్డి 2026 మార్చి 10న లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. వెంకట్ రెడ్డి వరంగల్ లోని ఏఆర్పీసీగా హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మృతి చెందారు. ఈ మృతులందరికీ ఎస్బీఐలో ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండటంతో బ్యాంక్ అధికారులతో సంప్రదించి డీజీపీ వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీజీపీతో పాటు ఎస్‌బీఐ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -