Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ రిపోర్టర్ ను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్

 రిపోర్టర్ ను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్

- Advertisement -

 నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణానికి చెందిన రిపోర్టర్ కలిగొట చిన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మంగళవారం ఆయనను పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. కలిగొట చిన్న త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన విధుల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయనకు ధైర్యం చెప్పి, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు షేర్ ఒడ్డెన్న, చిన్నరెడ్డి, లింగం, నరేష్, వజ్ర ఒడ్డన్న (మామిడిపల్లి), చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -