Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత గంజాయి, డ్రగ్స్ వ్యసనాలకు అలవాటు పడొద్దు..

యువత గంజాయి, డ్రగ్స్ వ్యసనాలకు అలవాటు పడొద్దు..

- Advertisement -

– గంజాయితో వ్యక్తి పట్టివేత.. రిమాండ్ కు తరలింపు
– రాయపోల్ ఎస్ఐ కె. మానస

నవతెలంగాణ – రాయపోల్  : యువత గంజాయి డ్రగ్స్ లాంటి ఇతర వ్యసనాల కొలువటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాయపోల్ ఎస్ఐ కె. మానస అన్నారు. మంగళవారం రాయపోల్ ఎస్ఐ కె.మానస సిబ్బందితో కలిసి రాయపోల్ గ్రామ శివారులోని అనాజిపూర్–కొత్తపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ వైపు నుంచి గోదుమ రంగు బ్యాగుతో వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను గమనించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతడిని పట్టుకున్నారు. సాక్షుల సమక్షంలో బ్యాగ్‌ను తనిఖీ చేయగా ఎండిన ఆకులు, మొగ్గలు, పుష్పాలు ఘాటైన వాసనతో కనిపించాయి. వాటిని గంజాయిగా గుర్తించిన పోలీసులు డిజిటల్‌ తూకం యంత్రంతో తూకం వేయగా 42.36 గ్రాముల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో గంజాయిని, నిందితుడు ఉపయోగించిన సెల్‌ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితుడిని రాంసాగర్ గ్రామానికి చెందిన మదికుంట గణేష్ గా గుర్తించారు. గతంలో తనపై రాయపోల్, దౌల్తాబాద్, గజ్వేల్, పేటబషీరాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ కేసులు ఉన్నట్లు అతడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2025లో గజ్వేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లినట్లు, 2026లో రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లోనూ తనపై కేసు నమోదైనట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.గణేష్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లిన సమయంలో గంజాయిని కొనుగోలు చేసి, ఇతరులకు విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు రాయపోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దొబ్బుట ఎస్ఐ వి నవీన్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు గౌడ్, కానిస్టేబుల్స్ స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -