Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అట్టహాసంగా ప్రారంభమైన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు..

అట్టహాసంగా ప్రారంభమైన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు..

- Advertisement -

– క్రీడల్లో ప్రతిభను చాటాలి : సర్పంచ్ మాసంపల్లి రాజు
నవతెలంగాణ- రాయపోల్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో ప్రతిభను చాటాలని రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు నాగరాజు అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్‌ పాఠశాలలో 70 వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఎస్‌జీఎఫ్ పోటీలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఖో – ఖో , కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాంశాల్లో అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 1న బాలికలకు, సెప్టెంబర్‌ 2న బాలురకు రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. మండలంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమష్టి భావనను పెంపొందిస్తాయని అన్నారు. పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీడీ గోవర్ధన్‌రెడ్డి, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పావని, అనీఫ్, రవి, ఉపాధ్యాయులు వసంత, అమరేందర్, సీఆర్పీలు యాదగిరి, ఎల్లాగౌడ్, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -