
కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఆదుకుంటుందని అనేదానికి డోంగ్లి మండలంలోని దోతి గ్రామానికి చెందిన వీరేశం కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతూ, బాన్సువాడ డివిజనల్ కేంద్రంలోని సెవెన్ హిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తకు, డోంగ్లి మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షులు గజానంద్ పటేల్ శనివారం ఆస్పత్రిని సందర్శించారు. కార్యకర్తను పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పేర్కొంటున్నారు. కార్యకర్తలు బాధలో ఉన్నప్పుడు ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నాయకుల్లో కార్యకర్తల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.