నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
సమాచార, పౌర సంబంధాల శాఖలోడీఎస్ జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్లోని సమాచార్భవన్లో జగన్ బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాల యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జగన్కు పదోన్నతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశా రు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంతో పాటు ప్రభుత్వం, ప్రజలు, మీడియా మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం జగన్ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డా. జి. ముకుంద రెడ్డిని కూడా కలిశారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ఆయనకు పదోన్నతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదనపు సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్ జగన్ మాట్లాడుతూ తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయడంలో శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది డి.ఎస్. జగన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాచార, పౌర సంబంధాల శాఖఅదనపు సంచాలకులుగా డీఎస్ జగన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



