బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలన, వెయ్యి రోజుల వంచన అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి వెయ్యి రోజులు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ నేతలను తిట్టేందుకే కోట్లాది రూపాయల ప్రజాధనంతో సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ వెయ్యి రోజుల పీడనపై మిర్యాల గూడలో ఏర్పాటు చేయనున్న కే టీఆర్ సభకు అనుమతి ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. మత పరమైన ఊరేగింపులు ఉంటే తప్ప సెక్షన్ 30 పెట్టరనీ, రాష్ట్రంలో ఆ సెక్షన్ ఎందుకు పెట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత ను రాజీనామా చేయమంటూ ర్యాలీలకు పిలుపునిస్తే సెక్షన్ 30 వర్తించదా అంటూ నిలదీశారు. తెలంగాణను మూడు భాగాలుగా విభజించి సీఎం మంత్రులు పంచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం అక్రమ ఆదేశాలను డీజీపీతో పాటు పోలీసు అధికారులు పాటించకుం డా బీఆర్ఎస్ సభలు, సమావేశాలకు అనుతివ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పై సీఎం వ్యక్తిగత దూషణలు సరికాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద
ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం దిగజారుడు బాషను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తగిన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. రేవంత్రెడ్డి సోదరులు, అనుచరులు, డ్రైవర్లు రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
రేవంత్ పాలన..వెయ్యి రోజుల వంచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



