Wednesday, September 2, 2026
E-PAPER
Homeబీజినెస్సుమధుర గ్రూప్ ‌చెన్నైకు విస్తరణ

సుమధుర గ్రూప్ ‌చెన్నైకు విస్తరణ

- Advertisement -


రూ.400 కోట్లతో భారీ ఇండస్ట్రియల్ పార్క్
హైదరాబాద్‌ : దక్షిణాదిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా వెలుగొందుతున్న సుమధుర గ్రూప్, చెన్నై మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఉత్తర చెన్నైలోని రెడ్ హిల్స్‌లో 52 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల భారీ పెట్టుబడితో గ్రేడ్-ఏ ఇండస్ట్రియల్ అండ్‌ లాజిస్టిక్స్ పార్క్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ‌చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ (సీపీఆర్ఆర్) వెంట రానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 12 లక్షల చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ స్థలం అందుబాటులోకి రానుండగా, డిసెంబర్ 2028 నాటికి నిర్మాణం పూర్తికానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 2,500 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆ సంస్థ సీఎండీ మధుసూదన్ జి తెలిపారు. చెన్నయ్‌ బలమైన తయారీ రంగం, అద్భుతమైన పోర్ట్ కనెక్టివిటీ తమ విస్తరణకు ఎంతగానో సహకరించాయని దేశంలో మారుతున్న సప్లై చెయిన్‌, ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా గ్రేడ్-ఏ వసతులను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సుమధుర గ్రూప్ ఇండస్ట్రియల్ అండ్‌ లాజిస్టిక్స్ డైరెక్టర్ వంశీ కరంగుల వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -