Friday, September 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు -2026 గ్రహీత డాక్టర్ బిఆర్. నేతకు సన్మానం

ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు -2026 గ్రహీత డాక్టర్ బిఆర్. నేతకు సన్మానం

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం : తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (C) గా పనిచేస్తున్న డాక్టర్ బి.ఆర్. నేత (చింతగూడ గ్రామ నివాసి)కు జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని తేది (29వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు) హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ఈ అవార్డు (*మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు 2026*)ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలాకిష్ట రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం  శాలువా, పూలమాల, జ్ఞాపిక, మరియు ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి అవార్డును ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా తన బాల్య మిత్రులు చింతగూడ 10 వ తరగతి 1993-94 బ్యాచ్ మరియు గ్రామ పెద్దలు చింతగూడ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి క్రీడల పై ఆసక్తి పెంచాలని దీని ద్వారా వారు సెల్ ఫోన్ కు దూరంగా ఉంటారు మరియు నాయకత్వ లక్షణాలు మెరుగు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరే శిరీష్ ,రామటెంకి శ్రీనివాస్, సీపతి కిషన్ దుర్గం శంకరయ్య, బత్తుల లక్ష్మిరాజం, రామటెంకి రాజయ్య, గ్రామ పెద్దలు నాసాని రాజన్న, మల్లికార్జన్ ,శ్రీనివాస్ లింగమూర్తి , మల్లేష్ సురేష్ సంతోష్,ప్రవీణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -