Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాంసాగర్, అల్లీసాగర్ పరిధిలోని సాగునీరు అందించేందుకు మంత్రి సనుకూలం..

నిజాంసాగర్, అల్లీసాగర్ పరిధిలోని సాగునీరు అందించేందుకు మంత్రి సనుకూలం..

- Advertisement -

– మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వెల్లడి..
నవతెలంగాణ – డిచ్ పల్లి 
: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి  నిజాంసాగర్, అల్లిసాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను, ప్రస్తుత పరిస్థితులను వివరించడం జరిగిందని దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారని మాజీ మంత్రి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు వెల్లడించారు.శుక్రవారం మాజీ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఎల్ నినో  ప్రభావం,  తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా, నిజాంసాగర్,  అల్లీసాగర్ పరిధిలోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

నీటి విడుదలను 1500 క్యూసెక్కుల నుండి ఇప్పుడు 2,000 క్యూసెక్కులకు పెంచి చివరి ఆయకట్టు వరకు నీటి క్రింది ప్రాంతాల (చివరి భూముల) వరకు పొడిగించేలా ఆదేశాలు ఇచ్చినట్లు మాజీ మంత్రి మండవ వివరించారు. అధికారులకు ఆదేశాలు: నీటి సరఫరాను పకడ్బందీగా పర్యవేక్షించి (monitoring) చివరి ఎకరం వరకు నీరు అందేలా చూడాలని ఈఎన్సీ (ENC) (ENC) జనరల్డ్, కామారెడ్డి సీఈ (CE) , నిజామాబాద్ సీఈ (CE)లాకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని చర్యలు చేపట్టినందుకు జిల్లా రైతాంగం, అల్లీసాగర్ ప్రాంత రైతుల తరఫున మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి  మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -