Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ  : మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆద్యాత్మిక శోభను భవిష్యత్ తరాలకు అందించడంలో ముఖ్యమైనవి అన్నారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో గ్రామంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామ ప్రజల భాగస్వామ్యంతో మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -