- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో 02-09-2026 రాత్రి నిజామాబాద్ నగరంలోని ఫైవ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓల్డ్ నాగరంలోని నల్ల పోచమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సునీల్ తెలిపారు. ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి, ఆలయంలో ఉన్న ఇనుప పెట్టెను దొంగిలించారు. ఆ ఇనుప పెట్టెలో సుమారు రూ.9,000/- నగదు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది.ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో ఐదవ టౌన్ ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి, చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
- Advertisement -



