Friday, September 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి

జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి

- Advertisement -

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ఆదేశం
నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్‌ ఎక్స్‌ రోడ్‌ దాటి బిచ్కుంద సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ అంజనేయులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌-1 డిపోకు చెందిన TS34Z0030 నంబర్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -