- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని నాగల్‌గావ్ జీపీ గ్రామంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణ జయంతి వేడుకలను టీచర్లు పంచశీల, అంజమని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణ చేయించి, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న కుండలు కట్టి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. ఈ వేడుకలకు పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను టీచర్లు శోభాయమానంగా అలంకరించారు.
- Advertisement -



