Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి 

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి 

- Advertisement -

 • భారీగా తరలిన బీఆర్ఎస్ యువత
నవతెలంగాణ -పెద్దవంగర

కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి లో భాగంగా శుక్రవారం పెద్దవంగర మండలంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. పెద్దవంగర మండలం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ యువకులు బైక్‌ లపై భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, మండల యువజన అధ్యక్షుడు, కాన్వాయిగూడెం సర్పంచ్ కాసాని హరీష్, పోచంపల్లి సర్పంచ్ వెంకన్న, వడ్డెకొత్తపల్లి సర్పంచ్ పరుశరాములు, కనుకుంట్ల వెంకన్న, దుంపల సమ్మయ్య, రాసల సమ్మయ్య, యాకన్న, వెంకన్న, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -