నవతెలంగాణ-నెల్లికుదురు
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ క్రీడా పోటీలకు ఆలేరు పాఠశాల విద్యార్థులు కార్తీక్, గౌతమ్ ఎంపికైనట్లు సాఫ్ట్ బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట ప్రేమ్ కుమార్ తెలిపారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్స్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు సాఫ్ట్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 11న నుంచి బెల్లంపల్లిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామదాసు, ఉపాధ్యాయులు, పిడి ఇమామ్, ఏపిసి చైర్మన్ సంతోషం వ్యక్తం చేసి, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఆలేరు విద్యార్థుల ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



