అనగనగా గంగాపురం అనే గ్రామంలో రాజు అనే పదేళ్ళ కుర్రాడు ఉండేవాడు. వాళ్ళ నాన్న ఆటో నడుపుతాడు. రాజుకి చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక – స్కూల్‌కి సొంత సైకిల్ మీద వెళ్ళాలని. కాని ఇంట్లో పరిస్థితి బాగా లేదు.
ఒక రోజు స్కూల్ నుండి వస్తూ దారిలో ఒక పాత సైకిల్ షాప్ చూశాడు. లోపల తుప్పు పట్టి చైను తెగిపోయి, టైర్లు పగిలిపోయిన ఒక పాత సైకిల్ ఉంది. దానికి చిన్న బోర్డు తగిలించి వుంది. ఆ బోర్డు మీద ‘అమ్మకానికి లేదు’ అని రాసి ఉంది.
షాప్ తాతయ్య అడిగితే ‘‘బాబూ ఇది నా కొడుకు సైకిల్, 20 ఏళ్ల క్రితం మా అబ్బాయి ప్రమాదంలో చనిపోయాడు. అతని జ్ఞాపకంగా దాచుకున్నాను’’ అన్నాడు తాత కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.
అప్పుడు రాజు ‘‘తాతయ్యా.. నేను రోజూ వచ్చి ఈ సైకిల్ తుడిచిపెట్టనా? మీ కొడుకు బదులు నేను చూసుకుంటా’’ అన్నాడు.
సరేనన్నాడు తాతయ్య.
అప్పటి నుంచి రోజూ స్కూల్ అయ్యాక గంట సేపు షాప్‌కి వెళ్ళి ఆ సైకిల్ ప్రేమగా తుడిచేవాడు రాజు. దానికి ఆయిల్ వేసేవాడు.
తాతకు రాజు తన కొడుకులా కనిపించసాగాడు.
6 నెలలు గడిచాయి. రాజు పుట్టిన రోజు వచ్చింది. ఆరోజు పొద్దున్నే తాత రాజు ఇంటికి వచ్చాడు. వెనకాల అదే సైకిల్ – కాని కొత్త పెయింట్, కొత్త టైర్లు, కొత్త చెయిన్‌తో సైకిల్ మెరిసిపోతుంది.
‘‘ఇది ఇక నీదే బాబూ. నా కొడుకు ఎక్కడున్నా నిన్ను చూసి సంతోష పడతాడు. జ్ఞాపకాలు మనసులో దాచుకోవాలి, షెడ్డులో కాదు’’ అని రాజు చేతికి ఇచ్చాడు తాత.
రాజు ఏడుస్తూ తాతను హత్తుకున్నాడు.
ఆ రోజు స్కూల్ మొత్తం ఆ సైకిల్ గురించే మాట్లాడుకున్నారు. కానీ రాజుకు తెలుసు – అది కేవలం సైకిల్ కాదు. ఒక తాత ప్రేమ అని అర్ధం చేసుకున్నాడు.
ఇపుడు రాజ 10 వ తరగతి ఇంకా అదే సైకిల్ తొక్కుతున్నాడు. వారాంతంలో తాత షాప్‌కు వెళ్ళి కూర్చుంటాడు. ఇద్దరు కలిసి టీ తాగుతూ, సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
నీతి:- కొన్ని వస్తువులు విలువ డబ్బులతో కాలువలేం. ప్రేమ, జ్ఞాపకం, నమ్మకం కలిస్తే పాత ఇనుముకూడా బంగారంగా మెరుస్తుంది.
పి. శివ చరణ్య,
8వ తరగతి
ZPHS మేడిపల్లి, సిద్దిపేట జిల్లా
పాత సైకిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



